కలం, వెబ్‌డెస్క్ : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit – 2025) రెండోరోజు కొనసాగుతోంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదిక గా జరుగుతున్న ఈ సదస్సుకు సినీ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనిల్ కుంబ్లే, పీవీ సింధూ, గుత్తా జ్వాల, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్ వంటి క్రీడా ప్రముఖులను ఆహ్వానించింది. వీరు క్రీడల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని పలు కీలక సూచనలు ఇవ్వనున్నారు. ఒలంపిక్స్ లో పతకాలే లక్షంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే క్రీడలపై చర్చించేందుకు రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ (Telangana Global Summit – 2025) లో ఒలంపిక్ గోల్డ్ క్వెస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీలో దేశంలోనే తొలి మహిళ ఫుట్ బాల్ అకాడమీతో పాటు, దేశంలో రెండో మెన్స్ ఫుట్ బాల్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కాగా, రెండో రోజు జరిగే గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణలో క్రీడలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర భవిష్యత్ ను దిశానిర్దేశం చేసే తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను నేడు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాత్రి గిన్నిస్ రికార్డు లక్ష్యంగా భారీ డ్రోన్ షో నిర్వహించనున్నారు.
Read Also: సుప్రీంలో SIR వాదనలు.. పార్లమెంటులో 10గం.ల డిబేట్!
Follow Us On: Instagram


