కలం, వెబ్ డెస్క్: రోజుకురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. హెల్మెట్ లేని కారణంగా ప్రాణాలు పోతున్న ఘటనలు వెలుగుచూస్తున్న వాహనదారుల్లో మార్పు రావడం లేదు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. అవగాహన కల్పిస్తున్నా చాలామంది హెల్మెట్‌ను ధరించడం లేదు. ఫలితంగా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని తిరుపతిలోని పోలీసులు (Tirupati Police) ద్విచక్ర వాహనదారులకు గట్టి షాక్ ఇచ్చారు. ‘హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయొద్దు‘ అనే నిబంధనను తీసుకొచ్చారు. డిసెంబర్ 15 నుంచి ఈ రూల్స్ అమలుకానున్నాయి.
రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికి తిరుపతి పోలీసులు (Tirupati Police) ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ను కఠినంగా అమలుచేస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు పోలీసులు జరిమానాలు విధిస్తున్నా రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారు. జాతీయ రోడ్డు ప్రమాదాల డేటా ప్రకారం దాదాపు 45 శాతం ప్రమాద మరణాలు ద్విచక్ర వాహనదారుల వల్లే సంభవిస్తున్నాయని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. అతివేగం, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం మరణాలకు ప్రధాన కారణాలుగా తేల్చి చెప్పారు.
వాహనదారుడుతో పాటు రైడర్ ఇద్దరూ హెల్మెట్లు ధరిస్తే 40 శాతం మరణాలు తగ్గించవచ్చన్నారు. అనుకోని ప్రమాదాల కుటుంబ ఆర్థిక వ్యవస్థను దెబ్బతిస్తున్నాయి. దీంతో జిల్లా అంతటా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు పోలీసులు. డిసెంబర్ 15 తర్వాత ద్విచక్ర వాహనదారుల్లో మార్పు రాకుంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల యజమానులను అలర్ట్ చేసి, ఇప్పటికే సమాచారం అందించారు. తిరుపతిలో ‘నో హెల్మెట్, నో పెట్రోల్‘ విజయవంతమైతే ఏపీ వ్యాప్తంగా అమలయ్యే అవకాశాలున్నాయి.
Read Also: వర్చువల్ కిడ్నాపింగ్తో జాగ్రత్త : అమెరికా
Follow Us On: X(Twitter)


