epaper
Friday, January 16, 2026
spot_img
epaper

పుతిన్​ ఇంటిపై దాడి.. వీడియో విడుదల

కలం, వెబ్​డెస్క్​: రష్యా అధ్యక్షుడు పుతిన్​ ఇంటిపై ఉక్రెయిన్​ డ్రోన్ల దాడి (Putin residence attack) కి సంబంధించి ఆధారాలను రష్యన్​ మిలటరీ బయటపెట్టింది. రెండు దేశాల మధ్య యుద్ధం ముగించి, శాంతి ఒప్పుందం కుదిర్చాలని ఒకవైపు ప్రయత్నాలు జరుగుతుండగానే ఈ నెల 29న రాత్రి పుతిన్​ ఇంటిపై దాడి జరిగినట్లు రష్యా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వీడియోను రష్యా రక్షణ శాఖ బుధవారం బయటపెట్టింది. నోవోగ్రాడ్​లోని పుతిన్​ ఇంటిపై ఉక్రెయిన్​ మొత్తం 91 దీర్ఘశ్రేణి డ్రోన్లు ప్రయోగించిందని, వాటిని కూల్చేశామని చెప్పిన రష్యా, దాడికి సంబంధించిన వీడియో విడుదల చేసింది. ఇందులో మొదట కూలిపోయిన ఒక డ్రోన్​ను చూపించగా, ఆ తర్వాత గాలిలోనే మిగతా డ్రోన్లను పేల్చేసినట్లు ఉంది. కాగా, పుతిన్​ ఇంటిపై దాడిని భారత ప్రధాని మోదీ ఖండించిన సంగతి తెలిసిందే.

Read Also: ఖలీదా జియా అంత్యక్రియలు.. హాజరైన జైశంకర్​

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>