epaper
Sunday, March 1, 2026
epaper

ఫ్యామిలీ సూసైడ్స్ – పెరిగిపోతున్న విపరీత ధోరణి

కలం, తెలంగాణ బ్యూరో: తల్లి, తండ్రి, కొడుకు.. ఓ చిన్న కుటుంబం! కొడుకుకు 24 ఏండ్లు. జాబ్ లో సెట్ చేసి, ఇంటివాణ్ని చేయాల్సిన టైమ్ వచ్చింది. కానీ, కలిసికట్టుగా ఆ కుటుంబం దారుణ నిర్ణయం తీసుకుంది. తల్లితండ్రీ ఉరేసుకోగా.. కొడుకు చేతి మణికట్టు కోసుకొని ప్రాణాలు (Family Suicides) వదిలాడు. ఇదీ తాజాగా హైదరాబాద్ లో జరిగిన విషాదం!!

ఇటీవల ఉప్పల్‌కు చెందిన తల్లీ, కూతురు, కొడుకు.. ఒకరినొకరూ హత్తుకుని ఘట్‌కేసర్–చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై గూడ్స్ రైలుకు ఎదురెళ్లి చనిపోయారు. “ఈ జీవితం చాలా భారంగా ఉంది. బతకాలని ప్రయత్నించినా.. బతకలేకపోతున్నా. పిల్లలను వదిలి వెళ్లలేక నాతో పాటు తీసుకెళ్తున్నా..” అని ఆ తల్లి రాసిన సూసైడ్ నోట్ లో ఉంది.

ఒకటి కాదు రెండు కాదు, ఈ మధ్య ఇలాంటి దారుణాలు పెరిగిపోయాయి. కన్న బిడ్డలను చంపి, పెద్దలు ఆత్మహత్య చేసుకోవడం.. ‘‘నువ్వు లేకుంటే మేం లేం” అనే భావనతో కుటుంబాలకు కుటుంబాలే బలవన్మరణానికి పాల్పడటం.. అనే విపరీత ధోరణి సమాజంలో వ్యాపిస్తున్నది. కరోనా తర్వాత తలెత్తిన పరిస్థితులతో చాలా మందిలో మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ పెరిగిపోయాయి. చిన్న చిన్న సమస్యలకు కంగారు పడుతున్నారు. ధైర్యం చెప్పే తోడు లేక, ఎలా ఉన్నారని పలకరించే దిక్కు లేక దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమస్య ఎదురైతే దాని నుంచి బయటపడే దారిని వెతికే బదులు.. కుటుంబాలకు కుటుంబాలే మృత్యువు ముఖంలోకి తలదూర్చుతున్నాయి. ఒకప్పుడు సమస్య ఎదురైన వ్యక్తే తనను తాను శిక్షించుకునే వాడు. కానీ, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం బలవన్మరణాలకు పాల్పడుతుండటం సమాజాన్ని వేలెత్తి చూపిస్తున్నది. దీనికి కారణాలు ఏమిటి? పరిష్కారం ఎక్కడ?

ఫ్యామిలీ సూసైడ్స్‌పై కలం 360 డిగ్రీస్ కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Family Suicides
Family Suicides

Read Also: ఎంప్లాయీస్​ vs సర్కార్.. సహనమా.. సమరమా..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!