నేడు ఇజ్రాయెల్‌ కు ప్రధాని మోదీ

కలం, వెబ్​ డెస్క్​ : భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఇజ్రాయెల్ (Israel) చేరుకోనున్నారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. తొమ్మిదేళ్ల కాలంలో మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2017లో ఆయన పర్యటించిన సమయంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ఈ పర్యటన ద్వారా ఆ బంధం మరిన్ని కొత్త ఎత్తులకు చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ (Narendra Modi) ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయి కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయం, నీటి యాజమాన్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాలు దృష్టి సారించనున్నాయి. అలాగే ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన ‘నెస్సెట్’లో మోదీ ప్రసంగించనున్నారు.

Read Also: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 264 మంది పోకిరీల‌కు పోలీసుల ట్రీట్మెంట్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>