కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపెల్లి జిల్లా రామగుండం (Ramagundam) పట్టణంలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. స్థానిక 28వ డివిజన్ కార్పొరేటర్ ధారంగుల కుమార్, 26వ డివిజన్ కార్పొరేటర్ భగవత్ నరసింహ సారయ్య నాయక్ లతోపాటు BRS పార్టీ సీనియర్ నాయకులు శివరాత్రి గంగాధర్‌లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరితోపాటు ఈ రెండు డివిజన్లకు చెందిన టీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి రామగుండం నియోజవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు.
ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేశ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వీటి బాలరాజు, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్, కుందనపల్లి సర్పంచ్ అరుకుటి కొమురయ్య, తదితరులు ఉన్నారు. పార్టీలో చేరిన సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, రామగుండం నియోజవర్గంలో ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ చేస్తున్న అభివృద్ధిని చూసి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నమని అన్నారు. గత 30 ఏళ్ళ నుంచి ఎన్నడు లేని విధంగా రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, పేదలకు అండదండగా నిలబడుతున్న ఎమ్మెల్యే అడుగుజాడలో నడవడానికి, నిరుపేద కుటుంబానికి సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సహకరిస్తామని తెలియజేశారు.

