కలం, వెబ్డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని (SPB Statue) రవీంద్రభారతి ప్రాంగణంలో సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాలు కుటుంబ సభ్యులతోపాటు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో తయారుచేయించారు. 7.2అడుగుల ఈ విగ్రహాన్ని కాంస్యంతో రూపొందించారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ఎస్పీబీకి ఇష్టమైన పాటలను సాయంత్రం 50 మంది గాయకులు ఆలపించనున్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో ఉండడం వల్ల విగ్రహావిష్కరణకు హాజరుకాలేకపోయారు.
Read Also: కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన తిలక్ వర్మ
Follow Us On: Sharechat


