Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుపతి యాత్రికులకు గుడ్‌న్యూస్.. ఈ మార్గంలో కొత్త రైలు సర్వీస్!

కలం, వెబ్‌డెస్క్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి–తిరుపతి (Charlapalli to Tirupati) మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న మార్గాలకు భిన్నంగా ఈ రైలు నల్గొండ–కడప రూట్‌లో ప్రయాణించనుంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి తిరుపతి చేరుకోవడం మరింత సులభతరం కానుంది.

ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన 07002/07031 చర్లపల్లి–తిరుపతి (Charlapalli to Tirupati) సర్వీసును ఇకపై 17443/17444 నంబర్లతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా కొనసాగించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ట్రైన్ నంబర్ 17443 తిరుపతి నుంచి ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం రోడ్, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంద. తొలి సర్వీస్ ఈ నెల 28న ప్రారంభం కానుంది.

అదే విధంగా ట్రైన్ నంబర్ 17444 చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4:20 గంటలకు బయల్దేరి బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా శనివారం ఉదయం 7:30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. ఈ సర్వీస్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.

Read Also: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లైట్ జ‌ర్నీలు.. జ‌న‌సేన కీల‌క ప్ర‌క‌ట‌న‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>