కలం స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ ఆడటానికి దక్షిణాఫ్రికా రెడీ అయింది. తాజాగా దక్షిణాఫ్రికా తన టీమ్‌ను (South Africa Squad) ప్రకటించింది. ఎయిడెన్ మార్క్రం ఈ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. గాయాల కారణంగా గతంలో జట్టుకు దూరమైన కగిసో రబడా, అన్రిచ్ నోర్కియా తిరిగి జట్టులోకి వచ్చారు. రబడా పేస్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. నోర్కియా బౌలింగ్ స్క్వాడ్‌కు చేకూర్చనున్నాడు. బ్యాటింగ్ స్క్వాడ్‌లో మార్కరమ్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, దేవాల్డ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెర్రెయిరా చోటు దక్కించుకున్నారు. బౌలింగ్ విభాగంలో క్వేనా మఫాకా, లుంగి ఎన్‌గిడీ, కార్బిన్ బోష్ కీలక పాత్ర పోషించనున్నారు.
ఈ జట్టులో ట్రిస్టన్ స్టబ్స్‌కు అవకాశం దక్కలేదు. కేవలం ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం ఉన్న జేసన్ స్మిత్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. జట్టు ఎంపికపై సెలెక్టర్ల చైర్మన్ పాట్రిక్ మొరోనీ స్పందించారు. భారత్, శ్రీలంక పరిస్థితులకు సరిపోయే అత్యంత బలమైన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు ప్రతిభావంతమైన యువ ఆటగాళ్లను జట్టులో చేర్చినట్లు పేర్కొన్నారు.
2024 టీ20 ప్రపంచకప్‌లో రన్నర్స్ అప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా గ్రూప్ డీలో అఫ్గానిస్తాన్ న్యూజిలాండ్ కెనడా యూఏఈ జట్లతో పోటీపడనుంది. టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది.
South Africa Squad ..
ఐడెన్ మార్క్రామ్(సి), క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, క్వేనా మఫాకా, లుంగి ఎన్గిడి, జాసన్ స్మిత్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే.
Read Also: ‘అమ్మో బాబర్‌ని కంట్రోల్ చేయడం చాలా కష్టం’
Follow Us On: Pinterest


