కలం వెబ్ డెస్క్ : పాకిస్థాన్(Pakistan) స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్(Babar Azam)కు బౌలింగ్ వేయడం చాలా ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుందంటూ ఆస్ట్రేలియా (Australia) పేసర్ సీన్ అబాట్ (Sean Abbott) కామెంట్ చేశాడు. బాబర్ ఫామ్‌లోకి వస్తే అతడిని కట్టడి చేయడం చాలా కష్టమని అబాట్ అంగీకరించాడు. బిగ్ బాష్ లీగ్ (Big Bash League) బీబీఎల్ 15లో సిడ్నీ సిక్సర్స్ (Sydney Sixers) తరఫున బాబర్ ఆజామ్, షాన్ అబాట్ కలిసి ఆడుతున్నారు. తోటి ఆటగాళ్లతో జరిగిన చర్చలో అబాట్ మాట్లాడుతూ బాబర్‌కు బౌలింగ్ చేయడం తనకు పెద్ద సవాల్‌గా మారిందని తెలిపాడు.
“బాబర్ ఎక్కడ కొట్టాలనుకుంటే అక్కడే కొడతాడు. అతడికి బౌలింగ్ చేయడం నాకు విసుగుగా మారింది. దేశవాళీ క్రికెట్ అయినా అంతర్జాతీయ క్రికెట్ అయినా నేను ఇప్పటివరకు అతడిని అవుట్ చేయలేకపోయాను” అని అబాట్ అన్నాడు. స్కోర్‌బోర్డ్ చూస్తే బాబర్ 120 స్ట్రైక్‌రేట్‌తో ఆడుతుంటాడని అతడిని అవుట్ చేసే అవకాశం మాత్రం కనిపించదని అబాట్ చెప్పాడు. ఇది తనకు నెమ్మదిగా కలిగే నిరాశగా ఉంటుందని వివరించాడు.
సిడ్నీ సిక్సర్స్ జట్టుకు బాబర్ ఆజామ్ (Babar Azam) ఎంతో కీలకమైన ఆటగాడని అబాట్ కొనియాడాడు. బాబర్ జట్టుకు అద్భుతంగా సరిపోయాడని అతడు సిక్సర్స్‌లో ఉండటం తమ అదృష్టమని పేర్కొన్నాడు.మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ షాన్ అబాట్ కీలక పాత్ర పోషించారు. బాబర్ 46 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేయగా అబాట్ మూడు వికెట్లు తీసి మెరిశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు బాబర్ ఐదు మ్యాచ్‌లలో రెండు అర్ధ శతకాలతో 129 పరుగులు సాధించాడు. మరోవైపు షాన్ అబాట్ 126 మ్యాచ్‌లలో 179 వికెట్లు తీసి బీబీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
Read Also: ‘మళ్లీ బంతిని పట్టుకోలేనన్నారు’
Follow Us On: Sharechat


