కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరసన దీక్ష విరమించిన నేపథ్యంలో సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు యధావిధిగా కొనసాగుతాయని సీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేంత వరకు ఈ నిరసనలను ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) 26 రోజుల పాటు చేసిన సుదీర్ఘ త్యాగాన్ని, అలాగే విద్యార్థులు సాగిస్తున్న నిరంతర పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా పోనివ్వబోమని అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన క్రూరమైన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల అణచివేత చర్యలకు నిరసనగా, రాబోయే రోజుల్లో ఈ ప్రజా ఆందోళనలను మరింత ఉధృతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also: నీట్ లీక్పై సుప్రీం సీరియస్: కేంద్రం, ఎన్టీఏలకు నోటీసులు!
Follow Us On : WhatsApp

