కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఆందళనల నేపథ్యంలో స్పందించిన ప్రధాని మోదీ వీడియో సందేశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) స్పందించారు. నీట్ పరీక్షా పేపర్ బాధితులకు న్యాయం చేయాలి.. ముందుగా పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మోదీ తొలగించాలని డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంలో విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ పేపర్ లీక్‌పై పార్లమెంటులో ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పారు.
ధర్మేంద్ర ప్రధాన్‌ను డిస్మిస్ చేశాకే ప్రధాని పార్లమెంటుకు రావాలని స్పష్టం చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు ఆదేశించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆ తర్వాతే విద్యా వ్యవస్థపై వివరణాత్మక చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. పార్లమెంట్ వెలుపల ఒకేవైపు మన్ కీ బాత్ చేపట్టవద్దని.. దీనిపై సభలోనే ప్రకటన చేయాలని చెప్పారు.

