కలం స్పోర్ట్స్: ‘నా కెరీర్ చాలా మలుపులు తిరిగింది. ఒకానొక సమయంలో చేతికి అయిన గాయం చూసి.. జీవితంలో మళ్లి క్రికెట్ బంతిని పట్టుకోలేనని, బౌలింగ్ చేయలేనని కొందరు వైద్యులు చెప్పారు. కానీ వాటన్నింటికి విరుద్ధంగా ఇప్పుడు క్రికెట్ ఆడుతూ బౌలర్‌గా రాణిస్తున్నా’’ అంటూ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు బౌలర్ చేతన్ సకారియా (Chetan Sakariya). కొద్ది రోజుల క్రితం, భారత్‌లోని ప్రతిభావంతులైన లెఫ్ట్ హ్యాండ్ బౌలర్‌గా చేతన్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ సందర్భంగానే చేతన్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
తీవ్రమైన గాయం కారణంగా రెండు సంవత్సరాలపాటు క్రికెట్‌కు దూరమయ్యాడు చేతన్. ఫిబ్రవరి 2024లో అతడి ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. దానికి సర్జరీ చేయించుకుని, లాంగ్ రీహ్యాబ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో తన కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నానని, మానసికంగా కృంగపోయానని తెలిపాడు. “గాయం జరిగినప్పుడు, తిరిగి క్రికెట్ ఆడగలానని నమ్మలేకపోయా. కానీ ఇప్పుడు బౌలింగ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తోంది” అని సకారియా (Chetan Sakariya) పేర్కొన్నారు. గాయం సమయంలో డాక్టర్లు కూడా ఆ మణికట్టుతో మళ్లీ బౌలింగ్ వేయలేనని చెప్పారని గుర్తు చేసుకున్నాడు.
తన కంబ్యాక్ IPL 2025లో జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ తరుపున గాయపడిన ఉమ్రాన్ మలిక్ స్థానంలో సకారియాకు అవకాశం దక్కింది. KKR మేనేజ్‌మెంట్, మాజీ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్, అతనిపై నమ్మకం చూపుతూ రీహ్యాబ్, శిక్షణలో పూర్తి మద్దతు ఇచ్చారు. “రాబోయే సీజన్‌లో ఏవైనా కష్టాలు వచ్చినా, ఇప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను,” అని సకారియా పేర్కొన్నారు.
Read Also: హెల్మెట్‌పై పాలస్తీనా జెండా.. క్రికెటర్‌కు పోలీసుల సమన్లు
Follow Us On: X(Twitter)


