కలం, వెబ్‌డెస్క్: ఓ దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో క్రికెటర్ హెల్మెట్‌పై పాలస్తీనా జెండా (Palestinian flag) గుర్తు ఉండడం కలకలం రేపింది. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. బుధవారం జమ్మూకశ్మీర్ ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా ట్రైల్‌బ్లేజర్స్‌తో మ్యాచ్‌లో జేకే11 టీమ్ ఆటగాడు ఫర్హాన్ భట్ ధరించిన హెల్మెట్‌పై పాలస్తీనా జెండా గుర్తు కనిపించింది. దీనిపై జమ్మూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణకు హాజరుకావాలని ఫర్హాన్ భట్‌కు పోలీసులు సమన్లు జారీ చేశారు.
అతనితోపాటు ఈ మ్యాచ్ నిర్వాహకుడు జహిద భట్‌ను, గ్రౌండ్ ఓనర్‌ను ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇటీవలే ఇజ్రాయిల్, హమాస్ దళాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే, ప్రత్యేక దేశం కోరుతూ పాలస్తీనియన్లు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా చాలా దేశాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే క్రికెటర్ పాలస్తీనా జెండా (Palestinian flag) గుర్తు ఉన్న హెల్మెట్ ధరించినట్లు భావిస్తున్నారు.
Read Also: మరో వరల్డ్ రికార్డ్‌కు చేరువలో బాబర్ ఆజమ్
Follow Us On: Instagram


