Mobile Popup Ad
Mobile Popup Ad

మధ్యాహ్న భోజనంలో పాము.. వందల మందికి అస్వస్థత

కలం, వెబ్ డెస్క్: బిహార్ రాష్ట్రంలోని సహస్ర డివిజన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిశిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వడ్డిస్తున్నారు. ఇంతలో ఓ చిన్నారి అన్నం ప్లేట్‌లో పాము (Snake) పిల్ల కనిపించడంతో వెంటనే.. టీచర్లకు సమాచారం అందించారు. అప్పటికే.. వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులు భోజనాలు చేసేశారు. కొద్దిసేపటి తరువాత.. ఒకరి తరువాత ఒకరు కడుపు నొప్పితో విలవిలాడిపోయారు. వాంతులు, విరేచనాలతో నరకం అనుభవించారు. దీంతో, వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. పదుల సంఖ్యలో అంబులెన్సులు, వాహనాలను రప్పించి.. దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ప్రాణపాయం తప్పినా.. పలువురి ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడలేదని డాక్టర్లు వెల్లడించారు.

విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు..

ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో.. సదరు పాఠశాలకు ఓ ఎన్జీవో సంస్థ ఆహారం సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో, అక్కడకు వెళ్లి.. ఆహార పదార్థాల శాంపిల్స్, ఇతర వివరాలు తీసుకున్నారు. ఇక నుంచి భోజనం సరఫరా చేయకుండా.. ఎన్జీవో సంస్థను బ్లాక్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>