Mobile Popup Ad
Mobile Popup Ad

పరాగ్ బాటలో చాహల్.. ఏకంగా విమానంలోనే ఆ పని ?

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో వివాదాలు తగ్గేలా కనిపించడం లేదు. మొన్న రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ దొరికిపోతే, ఇప్పుడు సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) అంతకు మించి విమానంలోనే వేపింగ్ (ఈ-సిగరెట్) చేస్తూ అడ్డంగా బుక్కయ్యారనే వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఒక వీడియో తీశారు. ఆ వీడియోలో చాహల్ వేపింగ్ చేస్తున్నట్లు నెటిజన్లు గమనించారు. విషయం వైరల్ అవ్వడంతో ఆ వీడియోను ఎడిట్ చేసి, చాహల్ ఉన్న సీన్లను తొలగించారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే దీనిపై అటు ప్లేయర్ కానీ, ఇటు టీమ్ మేనేజ్‌మెంట్ కానీ ఇంకా స్పందించలేదు.

ఇదే సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఇలాగే వేపింగ్ చేస్తూ దొరికిపోతే, అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. ఇప్పుడు చాహల్ విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఘటనలపై సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గట్టిగానే స్పందించారు. ఇలాంటివి పూర్తిగా నివారించదగ్గవని ఆయన అభిప్రాయపడ్డారు. “మీకు వ్యక్తిగత అలవాట్లు ఉండొచ్చు, కానీ వాటిని మీ వ్యక్తిగత ప్రదేశంలోనే ఉంచుకోవాలి. లక్షలాది మందికి మీరు స్ఫూర్తిగా ఉంటారు, కాబట్టి పబ్లిక్ ప్లేస్‌లో బాధ్యతగా ఉండాలి” అని పరాగ్‌ను ఉద్దేశించి అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాహల్‌కు కూడా వర్తిస్తాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>