Mobile Popup Ad
Mobile Popup Ad

స్మృతి మందాన పెళ్లి వాయిదా.. ఆఖరి నిమిషంలో..!

టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందానా(Smriti Mandhana) పెళ్లి వాయిదా పడింది. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్ఛల్‌తో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆదివారం వారిద్దరూ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సమయంలో స్మృతి మందానా తండ్రికి అనారోగ్యానికి గురికావడంతో.. ఆయనను ఆసుపత్రికి తరలించారు. సంగ్లీలో కొద్దిమంది స్నేహితులు, కుటుంబీకుల మధ్య వివాహం జరుపుకోవాలని స్మృతి, పలాష్ భావించారు. ఇదే సమయంలో తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో సంగ్లీలోని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. దీంతో వాళ్ల పెళ్ళిని వాయిదా వేసుకున్నారు. కాగా స్మృతి మందానా తండ్రి త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థనలు చేస్తున్నారు.

స్మృతి మందానా(Smriti Mandhana), పలాష్(Palash Muchhal) పెళ్లి వ్యవహారం కొన్ని రోజులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డీవై పాటిల్ స్టేడియంలో స్మృతికి పలాష్ ప్రపోజ్ చేసినప్పటి నుంచి ఈ అంశం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి జోరుగా నడుస్తోంది. వాళ్ల పెళ్లికి సంబంధించి ప్రతి అప్‌డేట్ సోషల్మీడియాను షేక్ చేశాయి. వాళ్లు తమ హల్దీ వేడుకలు, ప్రీ వెడ్డింగ్ క్రికెట్ మ్యాచ్ అన్నీ కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు స్మృతి తండ్రి ఆరోగ్యం క్షీణించడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Read Also: భారత పైలట్‌కు రష్యన్ టీమ్ నివాళి..

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>