epaper
Monday, March 2, 2026
epaper

భారత పైలట్‌కు రష్యన్ టీమ్ నివాళి..

దుబాయ్‌లో నిర్వహిస్తున్న ఎయిర్‌షోలో ప్రాణాలు కోల్పోయిన భారత పైలట్, వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్‌(Namansh Syal)కు రష్యా ఏరోబాటిక్ బృందం నివాళులు అర్పించింది. ఈ మేరకు టెలిగ్రామ్ ఛానెల్‌లో 17 సెకన్ల వీడియోను షేర్ చేశారు. ఈ సందర్బంగా తేజస్ ప్రమాదం తర్వాత పరిస్థితులను ఉద్దేశించి నోట్ షేర్ చేసుకున్నారు. ఆ ప్రమాదం వర్ణంచలేని బాధను మిగిల్చిందని, అవి చాలా కఠిన క్షణాలని పేర్కొన్నారు. “మన చివరి విమానంలో తిరిగి రాని సోదరుల కోసం… మా షెడ్యూల్ ప్రకారం ప్రదర్శనను కొనసాగించడం మా బాధ్యత” అని తెలిపారు.

దుబాయ్ ఎయిర్‌షో 2025లో ప్రదర్శన సందర్భంగా భారత్‌కు చెందిన తేజస్ మార్క్-1 యుద్ధ విమానం కూలింది. ఈ ఘటనకు అంతర్జాతీయ స్థాయిలో స్పందనలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారత వాయుసేన పైలట్, వింగ్ కమాండర్ నమన్‌శ్ స్యాల్‌(Namansh Syal)కు రష్యాకు చెందిన ప్రముఖ ఏరోబాటిక్ స్క్వాడ్రన్ రష్యన్ నైట్స్ తమ నివాళి అర్పించారు. అయితే ఈ ప్రమాదానికి ప్రదర్శనలో చేసిన లో-ఎల్టిట్యూడ్ నెగెటివ్-G మానేవర్ సమయంలో నియంత్రణ కోల్పోవడమేనని తేలింది.

Read Also: మరోసారి భగ్గుమన్న రేవంత్ రెడ్డి vs కోమటిరెడ్డి వర్గపోరు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!