Mobile Popup Ad
Mobile Popup Ad

హరీష్ రావుపై కేంద్రమంత్రి గడ్కరీకి కవిత లేఖ

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు(Harish Rao)పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)కి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) లేఖ రాశారు. ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను బీఆర్ఎస్ నేతలు ఎలా మార్చారు? అన్న అంశాన్ని కవిత తన లేఖలో వివరించారు. మెదక్ రెడ్డిపల్లిలో బీఆర్ఎస్ లీడర్లు తమకు చెందిన వందల ఎకరాల భూములను కాపాడుకోవటం కోసం RRR అలైన్మెంట్ మార్చారని కవిత ఆరోపించారు. ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ విషయంలో హరీష్ రావు చేసిన కుట్ర కారణంగా సన్నకారు రైతులు బలి అవుతున్నారన కవిత పేర్కొన్నారు.

ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌లో బీఆర్ఎస్ నాయకులు తమ స్వార్థం కోసం చేసిన మార్పుల వల్ల భూస్వాములు, రాజకీయ నాయకులకు చెందిన భూములు రోడ్డు పరిధి నుంచి తప్పుకుంటున్నాయని వివరించారు. కానీ సన్నకారులు రైతులు మాత్రం బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ నేతలు నాలుగు సార్లు అలైన్‌మెంట్‌ను మార్చారని స్థానికులు చెప్పిన విషయాన్ని కూడా కవిత పేర్కొన్నారు. కాగా ఈ అలైన్‌మెంట్ అంశంలో ఉన్న అనుమనాలను నివృత్తి చేయడం కోసం రీసర్వే చేయించానలని కవిత(Kavitha) కోరారు.

Read Also: మరోసారి భగ్గుమన్న రేవంత్ రెడ్డి vs కోమటిరెడ్డి వర్గపోరు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>