బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె(Deepika Padukone) కొంతకాలంగా వివాదాలకు కేరాఫ్‌గా మారారు. పని గంటల విషయంలో ఎక్కడ టాపిక్ వచ్చినా.. అది అటు తిరిగి ఇటు తిరిగి దీపిక దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘కల్కి’ సీక్వెల్ నుంచి కూడా దీపికను తొలగించడంతో ఆమె వైఖరే ఇక్కడిదాకా తెచ్చిందన్న వారు కూడా ఉన్నారు. కొంతకాలంగా తనపై జరుగుతున్న ఈ విమర్శలు, వివాదాలు అన్నింటిపై తాజాగా దీపిక స్పందించింది. ఈ సందర్భంగానే మరోసారి పని గంటల అంశాన్ని లేవనెత్తింది. చాలా మంది స్టార్ హీరోలు ఎంతో కాలంగా రోజుకు ఎనిమిది గంటలే పనిచేస్తున్నారని, వాళ్లు చేస్తే తప్పుకానిది తాను చేస్తానంటే తప్పెందుకవుతుందని ప్రశ్నించింది. అంతేకాకుండా అంతా కలిసి తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని పేర్కొంది.
‘‘ఎంతో మంది మేల్ సూపర్ స్టార్లు 8 గంటలే షూటింగ్‌లో పనిచేస్తున్నారు. వీకెండ్స్ వస్తే అసలు అందుబాటులో కూడా ఉండరు. పని చేయమని చెప్పేస్తారు. దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఇటీవల తల్లి అయిన ఇతర హీరోయిన్లు కూడా రోజుకు 8 గంటలే పనిచేయడం స్టార్ట్ చేశారు. కానీ వారు హెడ్‌లైన్లలో కనిపించరు. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నాపై ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం ఆపేయండి’’ అని దీపిక(Deepika Padukone) కోరింది.
Read Also: స్మృతి మందాన.. చేసింది తక్కువ స్కోరే అయినా రికార్డ్..!

