epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టాలీవుడ్‌లో సత్తా చాటిన చిన్న సినిమాలు.. 2025లో వీటిదే హవా

కలం, వెబ్ డెస్క్: 2025లో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. అందులో భారీ బడ్జెట్ నుంచి సింగిల్ బడ్జెట్ సినిమాలు సైతం ఉన్నాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఓ మూడు సినిమాలు  బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయోలు నమోదు చేశాయి. ఓటీటీ (OTT) కారణంగా ఇంటికే పరిమితమైన ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. అటు యూత్, ఇటు ప్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూడు తెలుగు సినిమాలు సింగిల్ డిజిట్ బడ్జెట్‌తో నిర్మితమై, 2025లో హిట్‌ సినిమాలుగా నిలిచాయి.

మార్చి 14న విడుదలైన ‘కోర్ట్‌’ (Court) మూవీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రియదర్శి, శివాజీ, ఇతరులు నటించిన ఈ చిత్రం పెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లను సాధించింది. నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చింది. ఈ మూవీని హీరో నాని ప్రమోట్ చేయడంతో ప్రేక్షకులకు ఎక్కువగా రీచ్ అయ్యింది. అలాగే సెప్టెంబర్‌ 5న విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా యూత్ హృదయాలను గెలుచుకుంది. ఈ మూవీ కూడా ఎక్కువగా లాభాలను ఆర్జించింది. చిన్న మూవీ అయినప్పటికీ, టీం సినిమాను బాగా ప్రమోట్ చేసింది.

నవంబర్‌ 21న ఈటీవీ విన్ నుంచి విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా థియేటర్లలో నాలుగు వారాలపాటు స్థిరంగా థియేటర్లలో ఆడింది. నిర్మాతలు, పంపిణీదారులు మంచి లాభాలు పొందారు. వీటితోపాటు 2025లో అనేక చిన్న బడ్జెట్ చిత్రాలు విడుదలయ్యాయి. కానీ కోర్ట్, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు టాలీవుడ్‌ (Tollywood)లో మంచి విజయాలు అందుకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>