కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వ్యవహరం అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. కడియం శ్రీహరి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి బెదిరించారని, గన్‍తో కాల్చి పడేస్తానని కౌశిక్ చేయితో సైగల్ చేశారనే ఆరోపణలు రావడంతో ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీరియస్ అయ్యారు. సభలో ప్రజా సమస్యలను చర్చించడానికి వచ్చిన సభ్యులు సభా సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఒక సభ్యుడిని బెదిరించే తీరులో వ్యవహరించినందుకు నిబంధనల ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సదరు సభ్యుడిపై చర్యలు తీసుకోకపోతే అది ఇకపైన కూడా సభలో అనైతిక చర్యలను ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. భవిష్యత్తులో సీనియర్ సభ్యులను అవమానించేలా, బెదిరించే తీరులో వ్యవహరిస్తే ఏమవుతుందో అనే సందేశం వెళ్ళాలని సూచించారు. అందువల్ల సభా సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని ఈ సెషన్ వరకు సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసి తదనంతరం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాన్న సీఎం.. వెంటనే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపు నియమించాలని కోరారు. కాంగ్రెస్ సభ్యులు పలువురు ఆయనను సస్పెండ్ చేయాలని కోరుతున్నా ముఖ్యమంత్రిగా తాను (Revanth Reddy) మాత్రం దాన్ని పునరాలోచిస్తున్నానని చెప్పుకొచ్చారు.
Read Also: సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ
Follow Us On: Instagram

