కలం, వెబ్‌డెస్క్: నేటి ఆధునిక కాలంలో యువత చర్మ సౌందర్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది ఎప్పుడూ ప్రెష్‌గా కనిపించాలనే ఉద్దేశంతో తరచూ ముఖం కడుగుతుంటారు. దీనివల్ల చర్మం దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే రోజుకు ఎన్నిసార్లు ముఖం కడగాలి? (Face Washing Routine) ఎటువంటి ఫేస్ వాష్‌లు ఉపయోగించాలి, చర్మ సంరక్షణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మన చర్మం పొడిబారకుండా ఉండేందుకు, చర్మంలో ‘సీబమ్’ అనే నూనె పదార్థం ఉత్పత్తి అవుతుంది. అయితే మనం ఎక్కువ సార్లు ముఖం కడగడం వలన ఈ నూనె పదార్థం తొలగిపోతుంది. దీనివల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజుకు 2 నుంచి 3 సార్లు మాత్రమే ముఖం కడుక్కోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.
ఎన్నిసార్లు కడగాలి
సాధారణంగా అందరి చర్మ తత్వం ఒకేలా ఉండదు. కొంత మందిది జిడ్డు చర్మం అయితే, మరికొంతమందిది పొడి చర్మం, ఇంకొందరు సాధారణ చర్మ తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే చర్మ తత్వాన్ని బట్టి రోజుకు ఎన్నిసార్లు ముఖం కడుక్కోవాలనేది (Face Washing Routine) ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణ చర్మతత్వం గలవారు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు రెండు లేదా మూడు సార్లు ముఖం కడుక్కోవచ్చు. అయితే వీరు ముఖం కడుక్కున్న తర్వాత ఖచ్చితంగా టోనర్‌ని ఉపయోగించాలి. దీనివల్ల ఎక్కువ సేపు ఫ్రెష్‌గా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక పొడి చర్మం ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు రోజుకూ ఒకటి లేదా రెండు సార్లు ముఖం కడ్కున్నప్పటికీ, కడిగిన వెంటనే మాయిశ్చరైజర్ ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. గాఢత తక్కువగా ఉండే సబ్బు లేదా లిక్విడ్ ఫేస్ వాష్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు.
Read Also: వ్యాధుల కాలం.. పేరెంట్స్ పిల్లలు జర భద్రం!
Follow Us On: Sharechat

