కార్చిచ్చు ఆర్పేందుకు వెళ్లి.. కుప్పకూలిన హెలికాప్టర్

కలం, వెబ్ డెస్క్: కార్చిచ్చును ఆర్పేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కుప్పకూలిపోయింది. ఇండోనేషియా (Indonesia Helicopter Crash)లోని దక్షిణ కాలిమంటన్ ప్రావిన్స్‌లో బరిటో క్వాలా రీజెన్సీ పరిధిలో కార్చిచ్చు చెలరేగింది. మంటలను అదుపు చేసేందుకు అధికారులు సహాయక చర్యల్లో EC225LP (VH-HGM) హెలికాప్టర్ ను వినియోగించారు.

అయితే, నదిలో నుంచి నీటిని సేకరించేందుకు ప్రయత్నిస్తుండగా హెలికాప్టర్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. హెలికాప్టర్ నదిలో కూలిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు సిబ్బందిని రక్షించారు. ఈ ఘటనలో ముగ్గురూ ప్రాణాలతో బయటపడినట్లు ఇండోనేషియా అధికారులు వెల్లడించారు. కాగా, నవంబర్ 8న జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు తాజాగా వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>