Mobile Popup Ad
Mobile Popup Ad

సిరీస్ నుంచి సినిమాగా.. ‘మిర్జాపూర్ ది మూవీ’ తెలుగు టీజర్ రిలీజ్

కలం, సినిమా : ఓటీటీ (OTT) ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ సిరీస్ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మిర్జాపూర్ ది మూవీ’ (Mirzapur The Movie) తెలుగు టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ విడుదలతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. క్రైమ్, యాక్షన్, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన మిర్జాపూర్ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ముఖ్యంగా ఇందులోని పవర్‌ఫుల్ పాత్రలు, ఉత్కంఠభరిత కథనం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే ప్రపంచాన్ని మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

తాజాగా విడుదలైన తెలుగు టీజర్‌లో యాక్షన్ సన్నివేశాలు, ఇంటెన్స్ డైలాగ్స్ ప్రేక్షకులని  ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో  ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. వెబ్ సిరీస్‌గా భారీ విజయాన్ని అందుకున్న ‘మిర్జాపూర్’ ఇప్పుడు సినిమా రూపంలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>