రాకెట్ దూసుకెళ్లడంతో క్రాకర్స్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్: దీపావళి వేళ సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం (Secunderabad Fire Accident) జరిగింది. డీబీఆర్ షోరూమ్ పక్కనే ఉన్న టపాకాయల దుకాణంలోకి ఓ రాకెట్ నేరుగా దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

క్షణాల్లోనే మంటలు షాపు మొత్తం వ్యాపించడంతో లోపల ఉన్న బాణసంచా పేలిపోయి క్రాకర్స్ దుకాణం పూర్తిగా దగ్ధమైంది. బాణసంచా పేలుళ్ల శబ్దాలతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కళ్లముందే తన షాపు పూర్తిగా కాలిపోవడంతో యజమాని కన్నీరుమున్నీరయ్యాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>