ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎంపీ చామలకు సిట్ నోటీసులు

కలం, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) లో సిట్ బృందం విచారణను స్పీడ్‎అప్ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) కి సమాచారం అందించారు. శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‎లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో విచారణకు రావాలని కోరారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేకమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ సైతం ట్యాపింగ్ గురైనట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. ఇందులో భాగంగానే చామల కిరణ్ కు సమాచారం అందించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఎంపీ చామల కీలక పాత్ర పోషించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆయన భువనగిరి నుంచి ఎంపీగా గెలిచారు.

Read Also: స్పా సెంటర్ల పై పోలీసుల మెరుపు దాడులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>