Mobile Popup Ad
Mobile Popup Ad

అండమాన్ దీవుల్లో భారీగా గ్యాస్ నిక్షేపాలు.. కేంద్రం ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల భారత్ కు ఇంధన సరఫరా సరిపడినంతగా జరగడం లేదనే విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ధరలు భారీగా పెరుగుతుండడంతో సామాన్య జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ పూరి సంచలన ప్రకటన చేశారు. అండమాన్ దీవుల్లో భారీగా గ్యాస్ (Andaman Gas) నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ విజయపురం-3 వద్ద సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు తెలిపారు. 355 మీటర్ల నీటి లోతులో ఈ సహజ వాయువును కనుగొన్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి.. 1900 మీటర్లకు పైగా లోతులో నిర్వహించిన ప్రాథమిక ఉత్పత్తి పరీక్షలలో, నిరంతర ఫ్లేరింగ్ ద్వారా సహజ వాయువు ఉనికిని నిర్ధారించినట్లు స్పష్టం చేశారు. అండమాన్ సముద్రంలో ఉన్న అపారమైన ఇంధన వనరుల సామర్థ్యాన్ని ఈ సరికొత్త ఆవిష్కరణ మరోసారి నిరూపించిందని హర్షం వ్యక్తం చేశారు. గ్యాస్ కెలోరిఫిక్ విలువను అంచనా వేయడానికి ఆయిల్ ఇండియా ప్రస్తుతం గ్యాస్ శాంప్లింగ్ చేపడుతోందని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>