కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)కు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలని సిట్ ఆదేశించింది. ఓ ప్రైవేట్ మీడియా ఛానల్ ఎండీ స్టేట్ మెంట్ మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. హరీశ్ రావు ఇంట్లో లేని సమయంలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే, హరీశ్ రావు విచారణకు హాజరవుతారా? లేదా చూడాలి. సిట్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టించే అవకాశం ఉంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఎలా స్పందిస్తారో ఉత్కంఠగా మారింది.


