కలం, వెబ్ డెస్క్ : నేతన్నలకు ఏపీ ప్రభుత్వం (AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది. త్రిఫ్ట్ ఫండ్ నిధులు రూ.1.67 కోట్లను రిలీజ్ చేసింది. ఈ నిధులను 133 చేనేత సహకార సంఘాల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి సవిత వెల్లడించారు. గతంలో రిలీజ్ చేసిన డబ్బుల మాదిరిగానే ఈ సారి కూడా 2025-26 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు రిలీజ్ చేశామని.. వీటి వల్ల 5,726 మందికి లబ్ది చేకూరుతుందని మంత్రి సవిత చెప్పారు. ఏపీలో చేనేత రంగం మీద ఆధారపడి ఎక్కువ మంది పనిచేస్తున్నారు కాబట్టి.. వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం (AP Govt) కట్టుబడి ఉందన్నారు మంత్రి సవిత.
సంక్రాంతికి ముందు ఆప్కో ద్వారా రూ.5 కోట్ల బకాయిలు చెల్లించామని.. అంతకు ముందు డిసెంబర్ నెలలో రూ.2.42 కోట్ల బకాయిలు చెల్లించినట్టు మంత్రి సవిత తెలిపారు. తాము నేతన్నలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో అస్సలు ఆలస్యం చేయట్లేదని.. గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందన్నారు మంత్రి సవిత. చేనేత రంగాన్ని ఏపీలో ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి వివరించారు.


