యువ‌తిని ప్రెగ్నెంట్ చేసిన చ‌ర్చి ఫాద‌ర్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: నంద్యాల (Nandyal) జిల్లాలో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. ఓ చ‌ర్చి ఫాద‌ర్‌ (Church Father) యువ‌తిని పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మ‌బ‌లికి శారీర‌కంగా వాడుకొని గ‌ర్భ‌వ‌తిని చేసి వ‌దిలేశాడు. జిల్లాలోని దేవ‌న‌గ‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. తండ్రి స‌న్నిధి అనే చ‌ర్చి ఫాద‌ర్‌గా ఉన్న ప్ర‌భుకుమార్ ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. ప్ర‌భుకుమార్ త‌న‌ను మోసం చేశాడ‌ని పేర్కొంటూ బాధిత యువ‌తి ఆందోళ‌న‌కు దిగింది. యువ‌తికి మ‌ద్ద‌తుగా బంధువులు, ప‌లువురు వ్య‌క్తులు చ‌ర్చి ముందు ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. యువ‌తికి ప్ర‌భుకుమార్ నుంచి బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని, త‌న‌తో పాటు త‌న అన్న‌ను చంపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని వెల్ల‌డించింది. ప్ర‌భుకుమార్ త‌న‌కు ఎనిమిది నెల‌ల నుంచి ప‌రిచ‌య‌మ‌ని యువ‌తి తెలిపింది. చ‌ర్చికి వెళ్తున్న‌ప్ప‌టి నుంచి త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌భుకుమార్ చెప్పే వాడ‌ని వెల్ల‌డించింది. త‌ను పెళ్లికి నిరాక‌రించిన బ‌ల‌వంతంగా ఒప్పించాడ‌ని చెప్పింది. ఆ తర్వాత ఒక రోజు ఇంట్లో ప‌ని ఉంద‌ని పిలిచి, త‌న‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డ‌ట్లు తెలిపింది. ఇప్పుడు పెళ్లికి నిరాక‌రిస్తున్నాడ‌ని, ప్ర‌భుకుమార్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధిత యువ‌తి పోలీసుల‌ను కోరుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>