Mobile Popup Ad
Mobile Popup Ad

గణపతి లొంగుబాటు వేళ ఆడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: మావోయిస్టు అగ్రనేత గణపతి కుమారుడి ముప్పాళ్ల వాసుదేవరావు ఎమోషనల్ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గణపతి లొంగిపోయాడని.. పోలీసుల అదుపులోనే ఉన్నారని, త్వరలో లొంగిపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆడియో ప్రాధాన్యత సంతరించుకున్నది. ‘తండ్రి ప్రేమ తెలిసిన వాడి మాటలు ఒకలా ఉంటాయి. తండ్రి ప్రేమ తెలియని వాడి మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి ప్రేమ కోసం ఎదురుచూసే నాలాంటి వాడి ఇంకెలా ఉంటాయి?’ అంటూ గణపతి కుమారుడు ఈ ఆడియోను మొదలుపెట్టారు.

ఎంతో కవితాత్మకంగా సాగిన 4.30 నిమిషాల. ఈ ఆడియోలో తండ్రి ప్రేమ కోసం ఎలా ఎదరుచూసిందీ.. తల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందీ.. కుమారుడు వివరించారు. నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి దశాబ్దాలుగా అజ్ఞాత జీవితంలో ఉంటూ పన్నెండు రాష్ట్రాలకు ఉద్యమాన్ని వ్యప్తి చేసి వేలాది మంది పార్టీ కేడర్‌ను తీర్చిదిద్ది మావోయిస్టు పార్టీకే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తన తండ్రి చాలా గొప్ప వాడని, చాలామంది చెబుతుంటే విన్నానని ఆ ఆడియోలో ప్రస్తావించారు. ఆడియో పూర్తిగా వినేందుకు కింద ఉన్న ఆలింక్ పైన క్లిక్ చేయండి.

Read Also: భ‌ట్టి కొడుకు పెళ్లిలో కేటీఆర్‌.. ఆత్మీయంగా ప‌ల‌క‌రించిన కాంగ్రెస్ నేత‌లు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>