వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

కలం, వెబ్​ డెస్క్​ : వనపర్తి (Wanaparthy) జిల్లా రేవల్లి మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఎదుల రైస్ మిల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. జాతరకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. రెండు ట్రాక్టర్లు ఒకదానినొకటి ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న ప్రయాణికులపై ట్రాక్టర్ వేగంగా దూసుకురావడంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>