ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం.. 12 ఏళ్ల‌కు ఒక‌సారి వేడుక‌!

క‌లం, వెబ్ డెస్క్‌: విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై కొలువుదీరిన క‌న‌క‌దుర్గ‌ ఆల‌యం (Kanaka Durga Temple) మ‌రో ప్ర‌త్యేక వేడుకల‌కు ముస్తాబైంది. కనకదుర్గ ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేకం నిర్వ‌హించ‌నున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వ‌హించే మహా కుంభాభిషేకం కోసం ఆల‌య అధికారులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే సకల దోషాల నివారణతో పాటు ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతూ మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ పండితులు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యానికి భ‌క్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు. ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>