కలం, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి రాజధాని దిశగా ప్రయాణం చేపట్టడంతో జాతీయ రహదారి 65పై సోమవారం కూడా భారీ వాహనాల రద్దీ కొనసాగింది. ఆదివారం మౌని అమావాస్య (Mauni Amavasya) కావడంతో పుణ్యస్నానాలు, దేవాలయ దర్శనాలకు వెళ్లినవారు సోమవారం తిరుగు ప్రయాణం ప్రారంభించడంతో ట్రాఫిక్ మరింత పెరిగింది. విజయవాడ–హైదరాబాద్ మార్గంలో ఉదయం నుంచే కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలు కిలోమీటర్ల కొద్దీ వాహనాలు లైన్లో ముందుకు సాగాయి కొన్ని చోట్ల వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదిలాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అవసరమైన చోట్ల మార్గమళ్లింపులు చేపట్టి రద్దీ తగ్గించే ప్రయత్నాలు చేశారు.
ఈ సందర్భంగా నార్కట్ పల్లి సిఐ నాగరాజు మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా లక్షల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ కు వెళ్తున్నాయని, రెండు రోజుల నుండి వెళ్తున్న వాహనాల కన్నా సోమవారం తక్కువ వాహనాలు వెళ్తున్నాయని సరైన ప్రణాళిక కష్టపడి పని చేసే తత్వం ఉంటే ఎంత పెద్ద కష్టమైన పనైనా సులువుగా చేయవచ్చని ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఇచ్చిన ధైర్యంతో పనిచేస్తుందామని ఆయన తెలిపారు.

Read Also : ఫోన్‌ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు సిట్ నోటీసులు
Follow Us On : Twitter


