Mobile Popup Ad
Mobile Popup Ad

బెంగాల్‌లో 58 లక్షల ఓట్లు డిలీట్.. ఎన్నికల అధికారి వివరణ

కలం, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇటీవల సర్ (SIR)  ప్రక్రియలో భాగంగా 58 లక్షల ఓట్లు డిలిట్ అయిన విషయం తెలిసిందే.  అయితే ఓ వర్గానికి చెందిన ఓట్లు గల్లంతైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈ వివాదంపై ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా  పర్యవేక్షించానని చెప్పుకొచ్చారు. అనర్హులను మాత్రమే ఓటరు జాబితా నుంచి తొలగించామని చెప్పుకొచ్చారు.

పోలింగ్‌లో హింసకు తావు లేదు

బెంగాల్ (West Bengal) ఎన్నికలు ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావివ్వకుండా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని మనోజ్ కుమార్ పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమయంలో జరిగిన 58 లక్షల తొలగింపు అత్యంత పకడ్బందీగా నిర్వహించామని చెప్పారు.

ఈసీ చేపట్టిన సర్ (SIR) ప్రక్రియ బెంగాల్ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారింది. ఒక నిర్దిష్ట సముదాయానికి చెందిన ఓటర్లను టార్గెట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 7.08 కోట్లకు తగ్గింది. 58 లక్షల పేర్లను తొలగించారు. ఈ అంశంపై మనోజ్ కుమార్  వివరణ ఇచ్చారు. ‘నేను నిష్పక్షపాతంగా పని చేశాను. 58 లక్షల తొలగింపులకు పూర్తి బాధ్యత తీసుకుంటాను. చట్టం ప్రకారం మాత్రమే వ్యవహరించాను.  నా పాత్ర పర్యవేక్షణ మానిటరింగ్ మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు.

ఆ తర్వాత, సుమారు ఐదు లక్షల ఓట్లు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (EROs) తొలగించారు మిగిలినవి న్యాయాధికారుల వద్దకు పంపించినట్టు చెప్పారు. “మొత్తం కేసులు 60 లక్షలకు చేరాయి. వాటిలో 27 లక్షల ఓట్లు తిరస్కరించారు. అప్పీళ్లు కొనసాగుతున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.

Read Also: అయ్యో అబ్బాయ్​.. లేదోయ్​ జోడీ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>