అయ్యో అబ్బాయ్​.. లేదోయ్​ జోడీ!

కలం, సెంట్రల్ డెస్క్: Telangana Bachelors | ‘పెళ్లెప్పుడవుతుంది బాబూ.. పిల్ల ఏడ దొరుకుతుంది బాబూ’.. ఇదీ తెలుగు సినిమాలోని పాట. ఇప్పుడు తెలంగాణలోని యువకులూ ఇదే పాట పాడుకోవాల్సి వస్తున్నది. అబ్బాయిలు పెళ్లికి రెడీ అయినప్పటికీ, అమ్మాయిలు దొరకడం లేదు. ఏండ్లకేండ్లు అమ్మాయిల కోసం ఎదురుచూసి అబ్బాయిలు చివరికి ఏజ్‌ బార్ అయిపోతున్నారు. ముదురు బ్యాచిలర్స్​గానే మిగిలిపోతున్నారు.

రాష్ట్రంలో కొన్ని సామాజికవర్గాల్లో పిల్లలు దొరకడం మరీ కష్టంగా మారింది. ఓసీ, బీసీల్లో సమస్య తీవ్రంగా ఉన్నది. ఓసీల్లో బ్రాహ్మణ, కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాల్లో.. బీసీల్లో యాదవులు, గౌడ్స్, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, మున్నూరు కాపు సామాజిక వర్గాల్లో సిచువేషన్ ఆందోళనకరంగా ఉన్నది. అమ్మాయిలు దొరక్కపోవడంతో కులాలతో ప్రస్తావన లేకుండా ఎవరినైనా చేసుకుంటున్నారు.

తెలంగాణలో అమ్మాయిలకు సరిపడా అబ్బాయిలు లేరు. సమాజం ఎంత ముందుకెళ్తున్నా.. ఈ విషయంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది మగవాళ్లకు 902 మంది ఆడవాళ్లు మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో వెయ్యి మంది బాలురు జన్మిస్తుంటే, 908 మంది బాలికలు మాత్రమే జన్మిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో సమస్య మరింత తీవ్రమవుతుంది. అబ్బాయిలకు అమ్మాయిలు ఎందుకు దొరకడం లేదు? ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిల సంఖ్య ఎందుకు పెరగడం లేదు? కొన్ని కులాల్లో అసలు అమ్మాయిలే దొరకని సిచువేషన్ ఎందుకొచ్చింది? అనే అంశాలపై ‘కలం 360 డిగ్రీస్‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Telangana Bachelors
Telangana Bachelors

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>