Mobile Popup Ad
Mobile Popup Ad

మొయినాబాద్‌ డ్ర‌గ్స్ కేసు.. పుట్ట మ‌హేశ్ కీల‌క వ్యాఖ్య‌లు

క‌లం, వెబ్‌డెస్క్‌: మొయినాబాద్ ఫామ్‌హౌస్ (Moinabad Farmhouse) డ్ర‌గ్స్ పార్టీ కేసులో ఇరుక్కున్న ఏలూరు ఎంపీ పుట్ట మ‌హేశ్ (Putta Mahesh) ఆ ఆరోప‌ణ‌ల‌ అనంత‌రం మొద‌టిసారి ఏలూరుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ కేసు ఇంకా విచార‌ణ‌లో ఉంది కాబ‌ట్టి చాలా వివ‌రాలు బ‌య‌ట చెప్పే అవ‌కాశం లేద‌న్నారు తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌న్న‌ది విచార‌ణ‌లో స్ప‌ష్టంగా తెలుస్తుంద‌ని తెలిపారు. డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ్డ వారంతా మొద‌టిసారి త‌న‌కు ప‌రిచ‌యం అయిన‌ట్లు తెలిపారు. వాళ్ల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధాలు లేవ‌ని వెల్ల‌డించారు.

ఈ కేసుకు సంబంధించి విచార‌ణ పూర్త‌యిన త‌ర్వాత ఎలాంటి మ‌చ్చ లేకుండా తాను బ‌య‌ట‌ప‌డ‌తాన‌న్నారు. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వెల్ల‌డైన త‌ర్వాత మీడియాకు అన్ని వివ‌రాలు చెప్తాన‌న్నారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, పార్టీ కార్య‌క్ర‌మాలు ఏమున్నా పాల్గొంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ క‌ష్ట స‌మ‌యంలో త‌న‌కు (Putta Mahesh) అండ‌గా నిలిచిన ఏలూరు ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Read Also: ‘ఏప్రిల్ 29 లోపు లొంగిపోండి’.. ప్రధాని మోదీ వార్నింగ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>