Mobile Popup Ad
Mobile Popup Ad

కవిత పార్టీ ఆవిర్భావ సభ.. క‌రీంన‌గ‌ర్ నుంచి భారీగా జన సమీకరణ

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్న సందర్భంగా కరీంనగర్ (Karimnagar) జిల్లా నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ జాగృతి జిల్లా స్థాయి సమావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ… జన సమీకరణలో భాగంగా మండలాల వారీగా బాధ్యులను నియమించుకొని జిల్లా నుంచి రెండు వేల మందికి పైగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 25వ తేదీన కవిత (Kavitha) నాయకత్వంలో తెలంగాణ జాగృతి నూతన రాజకీయ పార్టీగా (Party Launch) రూపాంతరం చెందుతున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున వెళ్లి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కవిత ఒక్కరే కృషి చేస్తున్నారని హ‌రిప్ర‌సాద్‌ అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కవిత కాబోయే సీఎం అవుతారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన చరిత్ర కేవలం జాగృతి సంస్థకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీరాముల రమేష్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు చంటి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, బండమీద అంజయ్య, తోగోటి తిరుపతి, గాలిపల్లి రత్నాకర చారి, ఎండీ సల్మా, జంగా అపర్ణ సాగర్, కుతాడి రజిత, పల్లె శారద, మ్యక వినోద్, ఎండీ రజి, బత్తిని సాగర్ గౌడ్, గువ్వ శ్రీనివాస్, కాంతాల రోజా రెడ్డి, కొలిపాక గౌతమి, ఎండీ అసియా సుల్తానా, గాజుల నవ్య, పుల్లురి అంజలి, గర్శకుర్తి విద్యాసాగర్, సీపెళ్ళి వెంకటేష్, బండ అశోక్, దిటి శిరీష రమేష్, వొద్దుల వాణి, జీవన్, తదితరులు పాల్గొన్నారు.

Read Also: అనుకున్నదొక్కటి.. మోడీ ప్లాన్ ఢమాల్..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>