కలం, వెబ్ డెస్క్ : Assam SIR | పట్టణీకరణ, ఉపాధి కోసం ప్రజలు తరచుగా వలస వెళ్లడం, విదేశీ అక్రమ వలసదారు పేర్లు ఓటరు జాబితాలో చేర్చడం వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) నిర్వహణకు శ్రీకారం చుట్టుంది. మొదటి విడుతలో బీహార్ లో సర్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు రెండో దశలో 12 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇటెన్సివ్ రివిజన్ కొనసాగుతోంది.
అస్సాంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Assam SIR) ప్రక్రియ పూర్తయిన తరువాత ఈసీ ఎలక్ట్రోరల్ రోల్ ను శనివారం విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,51,09,754 మంది ఓటర్లు ఉన్నారు. మరో 93,021 మంది డౌట్ పూల్ ఓటర్లు ఉన్నట్లు డ్రాఫ్ట్ లో పేర్కొంది. అయితే, చనిపోయిన వాళ్లు, వలసదారులు, నకిలీ ఓటర్లు ఇలా మొత్తం 10,56,291 మంది పేర్లను ఈసీ ఎలక్ట్రోరల్ జాబితా నుంచి తొలగించింది. కాగా, మరో 6 నెలల్లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Read Also: గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం: డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On: Youtube


