కలం, వెబ్ డెస్క్ : చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ చాలా సెటిల్‌గా ఆడాడు. ఎటువంటి తొందరపాటు, ఆందోళన లేకుండా ప్రతి షాట్‌ను చాలా సెలక్టివ్‌గా ఆడాడు. అతడి ఆటతీరును చూసి తనకు కాసేపు కోహ్లీ కనిపించాడంటూ తాజాగా మాజీ క్రికెట్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) కొనియాడాడు. సీఎస్‌కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్‌లో జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే తనకు విరాట్ కోహ్లీ గుర్తుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. గౌహతి వేదికగా జరిగిన ఈ పోరులో చెన్నై నిర్దేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ సులువుగా ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52) ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే, జైస్వాల్ మరో ఎండ్‌లో చాలా మెచ్యూర్‌గా వ్యవహరించాడు. తాను కూడా వేగంగా ఆడాలనే అహాన్ని పక్కన పెట్టి, జట్టు విజయం కోసం 36 బంతుల్లో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
జైస్వాల్ (Yashasvi Jaiswal) ఆటతీరును విశ్లేషిస్తూ.. పెద్ద లక్ష్యాలను చూసేటప్పుడు వ్యక్తిగత స్కోరు కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని కోహ్లీ ఎలా భావిస్తారో, జైస్వాల్ కూడా అలాగే చేశాడని చోప్రా కొనియాడారు. తోటి బ్యాటర్ దూకుడుగా ఆడుతున్నప్పుడు అతడికి సహకారం అందిస్తూ, మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో ఉండటం గొప్ప విషయమని చెప్పారు. రన్ ఛేజ్‌లో నాటౌట్‌గా నిలిచే ఆటగాళ్లే అసలైన సూపర్‌స్టార్లు అని, జైస్వాల్ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడని చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డారు.
Read Also: పంజాబ్ వర్సెస్ గుజరాత్.. అసలు పోరు ఈ ప్లేయర్ల మధ్యే
Follow Us On : WhatsApp

