ఇండోనేషియా కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బ్యాన్

కలం, వెబ్ డెస్క్: తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇండోనేషియా (Indonesia) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని చిన్నారుల్లో ఒత్తిడి, డిప్రెషన్ పెరుగుతున్నందున 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. విద్యార్థి దశలో ఉండే చిన్నారులు సోషల్ మీడియా వాడటం వల్ల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కోల్పోతున్నారని గ్రహించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలు ఎక్కువగా వాడే యూట్యూబ్, ఫేస్ బుక్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, త్రెడ్స్, ట్విట్టర్ (X), బిగో రొబ్లాక్స్ (Roblox) వంటి సామాజిక మాధ్యమాల్లో 16 ఏళ్ల లోపు పిల్లలు ఖాతాలు తెరవకూడదని స్పష్టం చేసింది.

ఇండోనేషియా కమ్యూనికేషన్, డిజిటల్ వ్యవహారాల మంత్రి మ్యుత్య హఫీద్ మాట్లాడుతూ.. “ఈ నిబంధనలను పాటించడంలో ఎటువంటి రాజీ ఉండదు. అన్ని సోషల్ మీడియా కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్‌లలో పిల్లల అకౌంట్లను తొలగించాలి. సోషల్ మీడియాతో సుమారు 7 కోట్ల మంది పిల్లలపై ఈ ప్రభావం పడనుంది. ఇది కష్టమైన పనే అయినప్పటికీ, పిల్లల క్షేమం కోసం తప్పదు” అని చెప్పుకొచ్చారు. ఆగ్నేయాసియాలో ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్న మొదటి దేశం ఇండోనేషియానే (Indonesia) కావడం గమనార్హం. అయితే ఇంతకుముందు ఆస్ట్రేలియా దేశం సైతం తమ పిల్లలను సోషల్ మీడియా నుంచి కాపాడుకునేందుకు ఇలాంటి చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

కర్ణాటక, ఏపీలో బ్యాన్..

దేశంలోని కర్ణాటక, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు సైతం చిన్నపిల్లలా శ్రేయస్సు కోసం సోషల్ మీడియాను బ్యాన్ (Social Media Ban) చేశాయి. మొబైల్ వాడకం వల్ల పిల్లల మానసిక స్థితిపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టేందుకు 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అసెంబ్లీలో 17వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ సిద్ధరామయ్య ఈ సంచలన ప్రకటన చేశారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం రాష్ట్రంలోపిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేశారు. రాష్ట్రంలో 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. పిల్లల మానసిక వికాసం, చదువు, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ నిబంధనలకు సంబంధించి పూర్తి విధివిధానాలను 90 రోజుల్లోపు ఖరారు చేసి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

తెలంగాణలో సైతం చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేయడంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చిన్నపిల్లల భవిష్యత్తు కోసం గోవా ప్రభుత్వం సైతం సోషల్ మీడియాను బ్యాన్ చేసే దిశగా ఆలోచిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ అంశంపై లోతైన విశ్లేషణ చేస్తోంది. దేశ వ్యాప్తంగా చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేసేందుకు సమాలోచనలు చేస్తోంది. త్వరలోనే కేంద్రంలోని మోదీ సర్కార్ దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

Read Also: ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. ట్రంప్ సంచలన నిర్ణయం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>