కలం, వెబ్ డెస్క్: ప్రముఖ గాయని జానకి (Singer Janaki) అంత్యక్రియలు మైసూర్లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఆమె కడసారి చూపు కోసం, తుది వీడ్కోలు పలికేందుకు అభిమానులు, సినీ రంగ ప్రముఖులు రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మైసూర్ లోని శ్మశానవాటికలో జానకి మనమరాలు అప్సర అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె భౌతికకాయంపై జాతీయ జెండాను ఉంచి, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. బ్రాహ్మణ సంప్రదాయంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. ఈ సందర్భంగా ’జానకి అమర్ రహే‘ అనే నినాదాలతో మైసూర్ సిటీ మార్మోగింది. జానకమ్మ మరణంతో అద్భుతమైన సినీ శకం ముగిసింది.
Read Also: నా ప్రశ్నించే స్వరం ఆగదు.. ప్రకాష్ రాజ్ ఫైర్
Follow Us On: X(Twitter)

