నా ప్రశ్నించే స్వరం ఆగదు.. ప్రకాష్ రాజ్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో (Social Media) తనపై జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) స్పందించారు. తాను మౌనంగా లేనని, తనపై వస్తున్న విమర్శలు, ప్రచారాలను గమనిస్తున్నానని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి ప్రభావంతో కొంతమంది జనసైనికులు, కొన్ని మీడియా ఛానళ్లు, యూట్యూబర్‌లు తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలతో తన ప్రశ్నించే స్వరాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, “దిగజారండి.. దిగజారుతూనే ఉండండి. మీ దిగజారుడుతనాన్ని ప్రపంచం చూస్తోంది” అంటూ వ్యాఖ్యానించారు. సమాజంలోని అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం కొనసాగిస్తానని పేర్కొన్నారు.

Read Also: కమలంలో కలవరం.. ‘ఈటల’ గురి ఎటు?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>