కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ (Siddipet Municipal Commissioner Ashrith Kumar) పై సస్పెన్షన్ వేటు పడింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఈ నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అశ్రిత్ కుమార్ గైర్హాజరయ్యారు. అలాగే, ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడంలో విఫలం అవడంతో పాటు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించడం కారణంగా జిల్లా కలెక్టర్ కే.హైమావతి కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అశ్రిత్ కుమార్ ను కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సస్పెండ్ చేసి, విధుల నుండి తొలగిస్తూ CDMA శ్రీదేవి సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎంపీ చామలకు సిట్ నోటీసులు
Follow Us On: X(Twitter)

