కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట (Siddipet) పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల (Domestic Gas Cylinders) వినియోగంపై సివిల్ సప్లైస్ (Civil Supplies), ఎన్‌ఫోర్స్‌మెంట్ (Enforcement) అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వ్యాపార అవసరాల కోసం గృహ వినియోగానికి ఉద్దేశించిన డొమెస్టిక్ సిలిండర్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 14 హోటళ్లలో తనిఖీలు నిర్వహించి 24 డొమెస్టిక్ సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు.

