రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ..

కలం, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ (MS Dhoni)  తన రిటైర్మెంట్‌పై తాజాగా ఒక ఆసక్తికరమైన హింట్ ఇచ్చారు. ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన భవిష్యత్తు గురించి అభిమానులకు పరోక్షంగా సమాధానం ఇచ్చారు. 44 ఏళ్ల వయసులోనూ ధోనీ మైదానంలోకి వస్తుంటే వచ్చే కేరింతలు, “ధోనీ.. ధోనీ..” అనే నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించిన హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan), ధోనీని రిటైర్మెంట్ గురించి ప్రశ్నించారు. గతంలో “డెఫినెట్లీ నాట్” అని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, 60 ఏళ్ల వరకు ఆడవచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి ధోనీ చిరునవ్వుతో స్పందిస్తూ.. అది చాలా కష్టమని పేర్కొన్నారు. తన ఫిట్‌నెస్‌తో అది సులభమేనని శివకార్తికేయన్ అనగా, వయసు పెరిగే కొద్దీ ప్రదర్శన మెరుగుపడటం కంటే తగ్గడమే సహజమని, కానీ తాను మాత్రం కచ్చితంగా ప్రయత్నిస్తానని ధోనీ సమాధానమిచ్చారు.

ధోనీ నోటి నుండి వచ్చిన “ఐ విల్ ట్రై” (నేను ప్రయత్నిస్తాను) అనే మాటతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ధోనీ (MS Dhoni) సారథ్యంలో చెన్నై జట్టు 2010, 2011, 2018, 2021, 2023లో మొత్తం ఐదు సార్లు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ 2026 వేటను చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ప్రారంభించనుంది. అస్సాంలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతానికి ధోనీ ఆటపై ఉన్న ఉత్సాహం అభిమానుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.

Read Also: ఆ స్కామ్ తో నాకు సంబంధం లేదు.. సింగర్ మంగ్లీ క్లారిటీ

Follow Us On: Facebook

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>