‘కాంతారా-1(Kantara)’ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో చాలా సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. సినిమాకే ఆ సీన్‌లు వెన్నెముకగా నిలిచాయి. పులి సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ ట్విస్ట్, క్లైమాక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
అయితే ఈ సినిమా(Kantara)లో రిషబ్ శెట్టి.. డ్యూయల్ రోల్‌లో నటించాడని మీకు తెలుసా..! చాలా మంది దీనిని గమనించి ఉండరు. కానీ, ఈ మూవీలో రిషబ్.. రెండు పాత్రల్లో కనిపించాడు. ఆ పాత్ర పేరే ‘మాయావి’. ఈ మాయావిని కేవలం హీరో రిషబ్ శెట్టి మాత్రమే చూస్తాడు. ఆయన తప్ప మరెవరికీ కనపడడు. సినిమా మొత్తంలో మాయావి రిషబ్ శెట్టి(Rishab Shetty)ని గైడ్ చేస్తూ, అతని బలం ఏంటి, భూమిపై ఆయన ఉన్న కారణం ఏంటి అనే సీక్రెట్ చెబుతుంటాడు. ఆ పాత్రలో నటించింది రిషబ్ అని చాలా మందికి తెలీదు. ఈ విషయం తెలిశాక ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

