యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) ‘తెలుసు కదా’ సినిమాతో బాక్సఫీస్ దగ్గర మంచి హిట్ అందుకున్నాడు. టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధూకు ఈ సినిమా మంచి హిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ‘తెలుసు కదా’ సినిమా హిట్‌తో సిద్ధూ ఇదివరకు ప్రకటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘కోహినూర్(Kohinoor)’ అటకెక్కినట్లు తెలుస్తోంది. ‘తెలుసు కదా’ హిట్‌తో సిద్ధూ రేంజ్ మారిపోయింది. దీంతో ఇప్పుడు ‘కోహినూర్’కు భారీ బడ్జెట్ కావాల్సి వస్తుందని, దానికితోడు రెండు భాగాలుగా రావాల్సిన ‘కోహినూర్’ అంత బడ్జెట్ పెట్టే పరిస్థితి లేదనుకున్న మేకర్స్.. ఈ సినిమాను పట్టాలెక్కించడంపై డౌట్‌గా ఉన్నారు. కాగా, బడ్జెట్ సహా మరిన్ని కారణాల వల్ల ‘కోహినూర్’ సినిమాను పక్కన పెట్టాలని డిసూడ్ అయినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.
Read Also: హీరోగా మారనున్న లోకేష్.. డైరెక్టర్ ఎవరంటే..

