కర్ణాటక రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) బుధవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అయితే, తాను ఓ పెళ్లికి హాజరవడానికి వెళుతున్నట్లు విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ డీకే అన్నారు. అలాగే ‘ఓట్ చోరీ’పై కాంగ్రెస్ ఈ నెల 14న ఢిల్లీలో నిర్వహించే భారీ కార్యక్రమంపై అధిష్టానం పెద్దలతో చర్చించనున్నట్లు తెలిపారు. మరోవైపు మంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో పాల్గొంటున్న సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah).. డీకే పర్యటనపై స్పందించారు. తనకు ఆహ్వానం లేదని, పిలిస్తే తానూ ఆ పెళ్లకి వెళ్లేవాణ్నని వ్యాఖ్యానించారు. ఒకవేళ ముఖ్యమంత్రి పీఠం మార్పు విషయమైతే కేసీ వేణుగోపాల్ ద్వారా తనకు సమాచారం అందుతుందని, అప్పుడు ఢిల్లీ వెళతానని చెప్పారు.
కాగా, ముఖ్యమంత్రి పీఠం నుంచి సిద్ధరామయ్యను దించేసి, డీకే శివకుమార్(DK Shivakumar) కు సీఎం బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం కట్టబెడుతుందనే ఊహాగానాలు, వార్తలు నెలన్నరగా జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డీకే, సిద్దరామయ్య స్వగృహాలు వేదికగా, వాళ్లిద్దరి మధ్య రెండు సార్లు బ్రేక్ ఫాస్ట్ చర్చలు కూడా జరిగాయి.అయితే, తాజాగా డీకే ఢిల్లీ బయల్దేరి వెళ్లడంతో అధికార మార్పిడిపై మరోసారి జోరుగా చర్చలు మొదలయ్యాయి.
Read Also: ఆడపిల్లల రక్షణ కోసం ఇందూరు యువకుడి సాహసయాత్ర
Follow Us On: X(Twitter)


